మెగాస్టార్ 151 వ సినిమా సైరా షూటింగ్ పూర్తి చేసుకున్న  సంగతి తెలిసిందే.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.  ఆగష్టు 22 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుంది.  అదే రోజున మెగాస్టార్ 152 సినిమా ప్రారంభం కాబోతున్నది.  కొరటాల ఈ సినిమాకు దర్శకుడు.  


152 వ సినిమాలో మెగాస్టార్ రెండు రకాలుగా కనిపిస్తున్నారు.  దాని కోసం బాడీ షేప్ ను మార్చుకోబోతున్నారు.  ఒకటి రైతు పాత్ర కాగా, రెండోది ఎన్ఆర్ఐ పాత్ర.  ఈ రెండు పాత్రల్లో మెగాస్టార్ డిఫరెంట్ గా కనిపిస్తారట.  ఇందుకోసం మెగాస్టార్ జిమ్ లో కసరత్తులు చేయబోతున్నారు.  


బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ సమక్షంలో మెగాస్టార్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారు.  ఈ విషయంలో రామ్ చరణ్... బాలీవుడ్ హీరో సల్మాన్ ను రిక్వెస్ట్ చేయగా తన పర్సనల్ ట్రైనర్ ను రెండు నెలల పాటు హైదరాబాద్ పంపేందుకు ఒకే చేశారట.  


రెండు నెలల పటు మెగాస్టార్ ట్రైనింగ్ తీసుకున్నాక సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.  కొరటాల సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  సోషల్ మెసేజ్ ను ఇస్తూనే.. కమర్షియల్ గా సినిమాను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు కొరటాల.  


మరింత సమాచారం తెలుసుకోండి: