ఒక సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే... నెక్స్ట్ సినిమాకు రెమ్యునరేషన్ అమాంతంగా పెరిగిపోయింది.  సినిమా రంగంలో ఇది సహజమే.  అందులోను హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది.  వాళ్ళు కెరీర్లో ఉండేది తక్కువే కాబట్టి ఇలా రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు.  


కియారా అద్వానీకి బాలీవుడ్ లో సరైన హిట్ లేదు.  ఏంఎస్ ధోని సినిమా హిట్ కొట్టినా ఆమె పాత్రకు పెద్దగా పేరు రాలేదు.  లస్ట్ స్టోరీస్ చేసింది కానీ అది వెబ్ సిరీస్ కావడంతో ఆమెకు ఉపయోగం లేకపోయింది.  ఇదిలా ఉంటె రీసెంట్ గా ఈ అమ్మడు చేసిన కబీర్ సింగ్ సూపర్ హిట్ అయ్యింది.  


అర్జున్ రెడ్డి సినిమాకు ఇది రీమేక్.  ఇందులో హాట్ హాట్ గా ఉండే ముద్దు సన్నివేశాలు బోలెడు ఉన్నాయి.  అందులో ఈ అమ్మడు ఏ మాత్రం బెరుకు లేకుండా నటించింది.  మాములుగా ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో ఒకింత టెన్షన్ ఉంటుంది.  


కానీ, కియారా మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ సీన్స్ చేసింది.  సినిమా హిట్ లో ఆమెకు భాగం ఉండటంతో.. తన నెక్స్ట్ సినిమాకు రెమ్యునరేషన్ ను ఏకంగా పెంచేసినట్టు తెలుస్తోంది.   సినిమా హిట్ కొట్టింది.  పైగా ముద్దు సీన్స్ లో చేసేందుకు ఎలాంటి అవాంతరాలు లేవు కాబట్టి నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: