యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ నటించిన కల్కి సినిమాకు పాజిటివ్ బజ్ నడుస్తోంది.  ట్రైలర్ తరువాత ఆ బజ్ మరింత పెరిగింది.  అయితే, ఇదే సమయంలో శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా.. ఆది బుర్రకథ సినిమాలు వస్తున్నాయి.  రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండటంతో పాటు వాటికి కూడా పాజిటివ్ బజ్ ఉండటం విశేషం.  


ఇదే కల్కిని ఇబ్బంది పెడుతున్నది.  కల్కి థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంటే.. ఆ రెండు కూడా కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్నాయి.  ఈ మూడింటి మధ్య భారీ పోటీ ఏర్పడే అవకాశం ఉన్నది.  ఏ సినిమా బాగుంది అంటే ప్రేక్షకులు ఆ సినిమాను చూస్తారు.  


అయితే, కల్కి సినిమా కోసం భారీ ఖర్చు చేశారు.  విజువల్ ఎఫెక్స్ స్పెషల్ గా ఉన్నాయి.  రాజశేఖర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనే టాక్ వస్తోంది.  అ అనే సినిమాను తీసిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు.  బాహుబలి తరహాలో ప్రమోషన్ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.  


కంటెంట్ పరంగా కల్కి మెప్పించే అవకాశం ఉంది.  కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఒకవేళ మూడు సినిమాలు బాగున్నాయి అంటే కల్కి కలెక్షన్ల విషయంలో కాస్త తేడాలు వస్తాయి.  లేదు, మిగతా రెండు సినిమాల కంటే కల్కి బాగుంది అనే టాక్ వస్తే.. తిరుగుండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: