అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ మూవీ జులై 5 న రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు.  ప్రీ రిలీజ్ విషయంలో సినిమాకు భారీగా దక్కింది.  థియేట్రికల్ రైట్స్ మినహా శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది.  


ఓవర్సీస్, డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్ కలిపి మొత్తంగా దాదాపు రూ. 10 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.   సురేష్ ప్రొడక్షన్ సంస్థ నుంచి వస్తున్న ఈ మూవీ భారం మొత్తం అక్కినేని కోడలుపైనే ఉన్నది.  


ట్రైలర్ చూస్తుంటేనే అర్ధం అవుతున్నది.  సినిమా సినిమాకు సమంత తన నటనలో పరిణితిని పెంచుకుంటూ పోతున్నది.  తాను తప్ప మరొకరు ఇలాంటి సినిమాలు చేయలేరు అనే విధంగా సెట్ చేసుకుంటోంది.  సోలో హీరోయిన్ గా డిఫరెంట్ కనిపించేందుకు అక్కినేని కోడలు ప్రయత్నం చేస్తోంది.  


మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు ఇది రీమేక్.  70 ఏళ్ల బామ్మ.. 24 సంవత్సరాల యువతిగా మారిపోతే ఆమె... ఏం చేయాలి అనుకుందో దానిని ఎలా చేసింది.  వయసు తగ్గిన తరువాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నది సినిమా కథ.  మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: