మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చారు.  అలా సినిమా రంగంలోకి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్.  మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త.  సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.  అనుకున్నట్టుగా ఓ సినిమా చేశారు.  


చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన విజేత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  సినిమా విజయంతో కళ్యాణ్ దేవ్ ఆనందంలో ఉన్నాడు. ఇదిలా ఉంటె, కళ్యాణ్ దేవ్ భార్య, మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఆరు నెలకే క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది.  ఆమెకు వినిష్క అనే పేరు పెట్టారు.  


తాజాగా వినిష్క ఫోటోను సోషల్ ఇండియాలో షేర్ చేశారు.  ఈ ఫ్యామిలీ ఫోటోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  కళ్యాణ్ దేవ్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్ చేస్తున్నారు.  శ్రీజ పెద్ద కూతురు కూడా ఈఫొటోలో ఉండటం విశేషం.  ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


మెగాస్టార్ చిరంజీవి సినిమా 151 వ సినిమా సైరా కోసం మెగా కుటుంబం అంతా పనిచేస్తోంది.  ప్రతి ఒక్కరు ఏదో విధంగా సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారు.  పెద్దకూతురు కాస్ట్యూమ్ వర్క్స్ చూసుకుంటే రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  నిహారిక ఓ రోల్ చేసింది. మరి శ్రీజ..


మరింత సమాచారం తెలుసుకోండి: