రేపు విడుదల కాబోతున్న ‘కల్కి’ మూవీతో తనకు కెరియర్ బ్రేక్ వస్తుందనీ రాజశేఖర్ ఎన్నో ఆశలతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమా విడుదల కాకుండానే ఈమూవీ పై మహేష్ అభిమానులు మాటల దాడి చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఈమధ్య ‘ఫలక్ నుమా దాస్’ హీరో దర్శకుడు విశ్వక్సేన్ ఆసినిమా విడుదల సమయంలో చేసిన కొన్ని కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మహేష్ అభిమానులు ‘కల్కి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ అనాలోచితంగా చేసిన ట్విట్ పై విరుచుకు పడుతున్నారు. 

‘కల్కి’ సినిమాను అందరు చూడండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రశాంత్ వర్మ రాజశేఖర్ పోలీస్ డ్రెస్ వేసి నాగలి ఎత్తుకున్న లుక్ తో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. అయితే ఆ ఫోటోకు ప్రశాంత్ వర్మ ట్యాగ్ చేసిన కామెంట్ పై ఇప్పుడు మహేష్ అభిమానులలో విపరీతమైన రచ్చ జరుగుతోంది. 

కమర్షియల్ సినిమాలలో హీరో నాగలి ఎత్తిన సీన్స్ ఇప్పుడు చాల అవసరంగా మారాయి అంటూ ప్రశాంత్ వర్మ కామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్ కు వేరే అర్ధాలు తీస్తూ మహేష్ ‘మహర్షి’ సినిమాలో నాగలి పట్టుకున్న సీన్ పై ప్రశాంత్ వర్మ సెటైర్ వేసాడు అంటూ మండిపోతూ ప్రశాంత్ వర్మను టార్గెట్ చేస్తూ కామెంట్ పెడుతున్నారు. దీనితో ‘కల్కి’ విజయం రాజశేఖర్ తో పాటు ప్రశాంత్ వర్మకు కూడ అత్యంత కీలకమైన పరిస్థుతులలో ‘కల్కి’ విడుదలకు ముందు అనవసరంగా ప్రశాంత్ వర్మ మహేష్ అభిమానులను ఎందుకు కెలికాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: