యాక్ష్న్ సినిమాలకు ఒక ప్రత్యేక క్రేజ్ తీసుకొచ్చిన దర్శకుడు వి వి వినాయక్.  సుమోలు గాల్లో లేవడం ఆయన సినిమాల్లోనే చూస్తాం. యాక్షన్, కామెడీ రెండింటి కలయికతో సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు. చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నంబరు 150 సినిమాకి దర్శకత్వం వహించి చాలా రోజుల తర్వాత హిట్ సాధించాడు. అయితే అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది.

 

ఆ తర్వాత సాయి ధరమ్  తేజ్ హీరోగా " ఇంటిలిజెంట్" సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవి చూసింది. అయితే ప్రస్తుతం వి వి వినాయక్ తర్వాతి సినిమా ఏంటనేది క్లారిటీ లేదు. కానీ వి వి వినాయక్ హీరోగా ఒక సినిమా తెరెకెక్కనుందని వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలిసి రాలేదు. తాజాగా ఒక విషయం వినాయక్ ని కలవర పెడుతోంది.

 

వి వి వినాయక్, అనుమతి లేకుండా అక్రమ భవన నిర్మాణాల చేసినట్టు అధికారులు దర్శకుడిపై సీరియస్ అయినట్లు సమాచారం. వట్టినాగులపల్లిలో వివి.వినాయక్ అనుమతి లేకుండా ఆరు అంతస్థుల భవనం నిర్మించినట్లు తెలియగానే విచారించిన అధికారులు ట్రిపుల్ వన్ జీవోకు  వ్యతిరేకంగా ఉన్నట్లు కనుగొన్నారు.గండిపేట పరిధిలో ఉన్న వట్టినాగుల పల్లి కొత్త జిల్లాలు ఏర్పడకముందు గ్రామ పంచాయితీలో ఉండేది.

 

జిల్లాల ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వచ్చింది. అయితే వట్టినాగులపల్లిలో ఉన్నప్పుడు జీ+2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న వినాయక్ జీవోను లెక్క చేయకుండా జి+6 భవనాన్నీ నిర్మించసాగారు. జీహెచ్ఎంసీ ఇదివరకే   ఈ నిర్మాణాలపై సీరియస్ అయ్యింది. టౌన్ ప్లానింగ్ విభాగం మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. దర్శకుడు స్పందించకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఫ్లోర్లను కూల్చేశారు. ఈ విషయంపై వినాయక్ స్పందించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: