తెలుగు సినిమా రంగ‌మే కాదు... ప్ర‌తి ఒక్క తెలుగువాడు గ‌ర్వించ‌ద‌గిన వ్య‌క్తిగా చరిత్ర‌పుట‌ల్లో స్థానం ద‌క్కించుకున్న విజ‌య‌నిర్మ‌ల మృతి యావ‌త్ తెలుగు ప్ర‌పంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక విజ‌య‌నిర్మ‌ల సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి ప్రేమ ఎలా ?  చిగురించింది ? అన్న‌ది ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర అంశాలే వెలుగులోకి వ‌స్తాయి. 


1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల మరుసటి ఏడాదే సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో క‌లిసి సాక్షి సినిమాలో న‌టించారు. అప్పుడే వీరి ప్రేమ‌కు బీజం ప‌డ‌డం...అది పెళ్లివ‌ర‌కు వెళ్ల‌డం జ‌రిగాయి. కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. 


ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో సాక్షి సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ సినిమాలో కృష్ణ-విజయనిర్మల హీరో, హీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉండటం ప్రత్యేకత. 


సాక్షిలో దిగ్గ‌జ క‌మెడియ‌న్ రాజ‌బాబు న‌టించారు. ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన వ్య‌క్తే. ఇక ఆయ‌న‌కు ఆ కృష్ణుడి మ‌హ‌త్యం బాగా తెలుసు. అప్పుడు ఓ పాట‌లో కొత్త దంపతుల గెటప్‌లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి ఆయన ‘ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్’ అంటూ జోక్ చేశారు. 


ఇక సాక్షి సినిమాతో ప్రేమ‌లో ప‌డ్డ వీరు రెండేళ్ల తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. కృష్ణ- విజయనిర్మల ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఆమెకు అప్ప‌టికే కృష్ణ‌మూర్తితో పెళ్ల‌య్యి న‌రేష్ సంతానంగా ఉన్నారు. న‌రేష్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: