మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం `సైరాన‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. కాబ‌ట్టి ఎప్ప‌టి నుండో త‌న కోసం వెయిట్ చేస్తున్న కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌డానికి ఆయ‌న సిద్ధ‌మయ్యారు. ఆగ‌స్ట్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కాగా ఈ సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌.

 

పాత్రానుగుణంగా మంచి ఫిట్‌నెస్‌తో క‌న‌ప‌డ‌టానికి చిరు క‌స‌రత్తులు స్టార్ట్ చేశార‌ట‌. తండ్రి చిరు ఫిట్‌నెస్ ట్రయిన‌ర్ కోసం త‌న‌యుడు చ‌ర‌ణ్‌.. స‌ల్మాన్‌ను సంప్ర‌దించార‌ట‌. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కార‌ణంగా స‌ల్మాన్‌ఖాన్ ముంబై నుండి ఓ ట్ర‌యిన‌ర్‌ను హైద‌రాబాద్‌కు పంపార‌ట‌.

 

ఈ ట్ర‌యిన‌ర్ పర్య‌వేక్ష‌ణ‌లో మెగాస్టార్ చిరంజీవి క‌స‌రత్తులు చేస్తున్నార‌ని స‌మాచారం. మెసేజ్‌మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన కొర‌టాల శివ చిరుని స‌రికొత్త కోణంలో ప్రెజంట్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. సల్మాన్ ఖాన్ భరత్ ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే..

 

సైరా తరువాత చేస్తోన్న సినిమాకు 63 ఏళ్ళ చిరంజీవి, 30 ఏళ్ళ యువకుడిలా కనిపించనున్నారట!  స్టూడెంట్ అండ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కనుందని, ఫిలిం నగర్ సమాచారం.  అయితే ఇందులో మనకు నిజం ఎంతుందో మనకు తెలీదు గానీ.. ఇలా రక రకాలుగా ఎవరికి నచ్చిన కథను వారు రాసేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: