తెలుగు బిగ్‌బాస్-3కు సంబధించి ఫేక్ న్యూస్ లు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏవరికి నచ్చినట్టు వాళ్ళు అనేసుకోని రాసేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌ విషయంలో మరీ దారుణంగా రాస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్-3 లో కంటెస్టెంట్‌గా యాంకర్ లాస్య వెళ్తున్నారని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం నిజమే. అయితే ఈ పుకార్లు అన్నీ పట్టించుకోనక్కర్లేదని లాస్య లైట్ తీసుకున్నా.. వార్తలు రోజురోజుకు ఎక్కువవడంతో ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను లాస్య పోస్ట్ చేసింది. 


బిగ్‌బాస్‌లోకి నేనా.. వచ్చేస్తున్నా..(నవ్వుతూ..) లాస్య ఎంట్రీ కన్ఫార్మ్‌ అయిపోయిందని షో ప్రారంభానికి ముందే 30 లక్షల రెమ్యునిరేషన్ అని రాశారు. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో కదా.. కానీ ఇదంతా పచ్చి అబద్ధం.. ఇట్స్‌ ఆల్ ఏ ఫేక్‌ న్యూస్‌. నాకు చిన్నబాబు ఉన్నాడు.. వాడితో గడిపేందుకే టైమ్‌ సరిపోతుంది. ఈ ఏడాది పూర్తిగా బాబుతోనే.. ఏదైనా ఉంటే నెక్ట్స్‌ టైమ్‌ చూద్దాం.. అని లాస్య పోస్ట్ చేసింది.


దీంతో ఫైనల్‌గా లాస్య కూడా బిగ్‌బాస్‌లో లేనని తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ మధ్యకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లాస్య దంపతులు.. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా వెళ్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పై విధంగా రియాక్ట్ అయ్యింది. దీంతో మన వాళ్ళకి మరి శ్రీ ముఖి అన్న ఉందా  లేదా..అని అనుమానాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: