చెవులు ముందా..కొమ్ములు ముందా..అంటే కరెక్ట్‌గా ఆన్సర్ తెలీక కొట్టుకు చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మన టాలీవుడ్ సినిమాల మీద, హీరోల మీద కూడా గాసిప్స్ రాయడానికి చాలా మంది ఇలానే పోటీ పడి మరీ కొట్టుకుంటున్నరన్న విషయం కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. అలాంటి గాసిప్ ఒకటి ఇప్పుడు బన్నీ-త్రివిక్రం సినిమా మీద వైరల్ అవుతోందని టాక్. బన్నీ-త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి కాకుండా డిసెంబర్ లో విడుదల చేస్తారంటూ రీసెంట్‌గా విపరీతంగా గ్యాసిప్ లు వినిపించాయి. జనవరిలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు వుండే అవకాశం క్లియర్ గా కనిపిస్తున్నందువల్ల, డిసెంబర్ అయితే సేఫ్ అన్న ఈ గ్యాసిప్ ఫిల్మ్ నగర్‌లో తెగ తిరుగుతోంది.


అయితే చిత్ర నిర్మాణ యూనిట్ మాత్రం అవన్నీ వట్టి గ్యాసిప్ లే అని కొట్టి పారేస్తున్నట్లు సమాచారం. జనవరి 11 లేదా 13లో ఏ డేట్ ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనతో చిత్ర బృందం వున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంటల్ గా 9, 10 డేట్ లు పనికిరావని పక్కన పెట్టేసారు. మహేష్-అనిల్ రావిపూడి సినిమాకు ఓ రోజు ముందు కానీ ఒక రోజు వెనుకగా గానీ బన్నీ-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ వుంటుందని స్ఫష్టం చేస్తున్నారు.


అటు మహేష్ సినిమా అయినా, ఇటు బన్నీ సినిమా అయినా పంపిణీ చేయాల్సింది మాత్రం దిల్ రాజునే. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా టూ ఎర్లీ కనుక, ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టి సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. కానీ సంక్రాంతి విడుదల మాత్రం పక్కా అంటున్నారు. ఓవర్ సీస్ మార్కెట్ లో కాస్త గట్టి పోటీ వుండేది ఈ రెండు సినిమాలకే. బాలయ్య సినిమా వున్నా కూడా ఓవర్ సీస్ లో సమస్య ఏమీవుండదు. ఎందుకంటే బాలయ్య సినిమాలు టాలీవుడ్‌కే పరిమితం కాబట్టి. అందుకే బన్నీ సినిమా ఆరు నూరైనా నూరు నూట తొంభై ఆరైనా సంక్రాంతికే వస్తున్నాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: