ఈ మధ్యకాలంలో సినిమాలకు బిజినెస్ అవడం ఎంత కష్ఠమవుతుందో తెలిసిందే. పది సినిమాలు విడుదలయితే వాటిలో 5 సినిమాలు బిజినెస్ కాకుండానే స్ట్రయిట్ రిలీజ్ చేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రొడక్షన్ కాస్ట్ అంతా రాబట్టేసుకుని, థియేటర్ హక్కులు దగ్గరే వుంచుకుని, స్ట్రయిట్ రిలీజ్ చేసుకోవడం అంటే అదృష్టమే అని చెప్పాలి. ఆ అదృష్టం పేరు ఓ బేబీ. మూడు నిర్మాణ సంస్థలు కలిసి సమంత కీలకపాత్రలో నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 13 కోట్లు. ఆంధ్ర, నైజాం థియేటర్ హక్కులు చేతిలో వుండగానే ఆ 13 కోట్లు దాదాపు రికవరీ అయిపోవడం విశేషం. 


ఇది చాలా తక్కువ సినిమాలకు సాధ్యపడుతుంది. సమంత క్రేజ్ కావచ్చు..లేదా సురేష్ బాబు సపోర్ట్ కావచ్చు..మొత్తానికి ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అవుతోంది.
ఓవర్ సీస్ రైట్స్ ద్వారా 1.75 కోట్లు, కర్ణాటక హక్కులు 75 లక్షలు, నెట్ ఫ్లిక్స్ ద్వారా 3 కోట్లు, శాటిలైట్ ద్వారా 2 కోట్లు వచ్చాయి. అలాగే హిందీ డబ్బింగ్ కు కూడా మూడుకోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 11 కోట్ల వరకు రికవరీ అయిపోయింది.


సినిమాలో సురేష్ బాబు భాగస్వామి కాబట్టి, ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేరుగా విడుదల చేస్తున్నారు. మిగిలిన ఇధ్దరు భాగస్వాములు టివి విశ్వప్రసాద్, సునీత్ దానికి ఓకె అన్నారు. సినిమా క్లిక్ అయితే లాభాల పంటే. సమంత లక్కీ లెగ్ అలా వుంది మరి. ఇక ఈ సినిమా కొరియన్ సూపర్ హిట్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఇది రీమేక్ సినిమా అని ఎక్కడా సందేహం కలగడం లేదు. మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియోట్ చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: