వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. సీనియర్లు.. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వారితో పెట్టుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. వీలైనంతవరకు ఎలాంటి సమస్యలనైనా లోలోపల పరిష్కరించుకోవాలనే భావిస్తారు తప్ప.. అనవసరంగా బయటకు రావాలని అస్సలు అనుకోరు. ఇది స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్ వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒక ప్రముఖ వ్యక్తి పైన మరో ప్రముఖ గాయని ఆరోపణలు చేయటం మామూలు విషయం కాదు. 


అలాంటి సాహసానికి తెర తీసి రియల్ హీరోగా నిలిచారు గాయని కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై మీటూ ఆరోపణలు చేసిన చిన్మయి ఉదంతం తమిళ చిత్రపరిశ్రమకు ఒక్క కుదుపునకు గురి చేసింది. ఎప్పటిలానే ఆమె ఆరోపణల వెంటనే ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం రెన్యువల్ అంటూ సాకు చూపించారు. ఆమె సభ్యత్వాన్ని తిరిగి కొనసాగించాలంటే ఆమె చేసిన ఆరోపణల్ని వెనక్కి తీసుకొని రాధారవికి సారీ చెప్పాలన్న డిమాండ్ తెచ్చారు. ఇలాంటి వాటికి ఏ మాత్రం లొంగని చిన్మయి.. కోర్టుకు వెళ్లి తనపై నిషేధానికి స్టే తెచ్చుకున్నారు. 


ఇదిలా ఉండగా సమంత నటించిన ఓ బేబీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో సమంత చిన్మయి కి తన ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిజాలు చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని.. చిన్మయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోందని.. ఎలాంటి తప్పు చేయని వ్యక్తి కి ఇలాంటి సమస్యలు రాకూడదని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది. ఒకనిజం కోసం పోరాడే వారికి.. అండగా మరో ప్రముఖ నటి నిలవటం మామూలు విషయం కాదు.. అందుకు సమంతకు హేట్సాఫ్ చెప్పాలి. సమంత లాంటి స్నేహితురాలు అందరికి దొరికితే ఎంత బాగుండు! అని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: