దశాబ్ధ కాలం నుండి హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరి స్టార్స్ తో నటించేసింది. మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు పరిశ్రమలో తెరంగేట్రం చేసిన తమన్నా ఆ తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్లీ హ్యాపీడేస్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటినుండి తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. 


తెలుగులో దాదాపు అందరి స్టార్స్ తో నటించిన మిల్కీ బ్యూటీ ఇన్నేళ్ల కెరియర్ లో తీరని కోరిక ఒకటి ఉందని చెబుతుంది. తనకు పూర్తిగా డ్యాన్స్ ప్రాధాన్యత కలిగిన పాత్ర చేయాలన్నది తన కోరిక అని అలాంటి కథ ఇప్పటివరకు తన వద్దకు తీసుకురాలేదని చెబుతుంది తమన్న. అలాంటి కథతో వస్తే వెంటనే ఓకే చెప్పేస్తా అంటుంది అమ్మడు.


మాములుగానే డ్యాన్స్ బాగా వేసే తమన్నా రెబల్ లో తన సోలో సాంగ్ లో ఇరగదీసింది. అప్పుడే ఆమెను పెట్టి ఓ డ్యాన్స్ కాన్సెప్ట్ మూవీ చేయొచ్చని ఫిక్స్ అయ్యారు. తమన్నా కోరిక కూడా అదే కావడంతో ఎవరైనా దర్శకులు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. ఈమధ్య స్టార్ హీరోయిన్స్ అంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.


అదే దారిలో తమన్నా కూడా వెళ్తుంది. రీసెంట్ గా అభినేత్రి 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా రాజు గారి గది 3 సినిమా చేస్తుంది. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే ఎఫ్-2 తో సూపర్ హిట్ అందుకున్న తమన్నా మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా తమన్నా స్పెషల్ రోల్ చేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: