నివేద థామస్ టాలెంట్ గురించి చెప్పాల్సిన పనేలేదు. నిన్నుకోరి.. జెంటిల్ మేన్.. జై లవకుశ .. 118 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు తనేంటో అర్థమైపోయింది. అందం .. అభినయం ఉన్న క్యూట్ హీరోయిన్‌గా అందరికి తెలిసిందే. అంతేకాదు నివేద బెస్ట్ క్లాసికల్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అయితే తనలోని డ్యాన్సర్ ని లైం లైట్లోకి తెచ్చేందుకు చేసిన సినిమానే 'బ్రోచేవారెవరురా' అని చిత్రయూనిట్ చెబుతోంది. లేటెస్ట్ గా బ్రోచేవారెవరురా ప్రీరిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు.. నివేద లోని డ్యాన్సింగ్ స్కిల్స్ కి పడిపోయానని, నివేదను తనదైన శైలిలో కామెంట్ చేశాడు.


అంతేకాదు అసలు బ్రోచేవారెవరురా సినిమా చేయడానికి కారణం ఇందులో 'మిత్ర' పాత్ర అని శ్రీవిష్ణు చెప్పడం విశేషం.. ప్రీరిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ కథ వినగానే నచ్చింది. టైటిల్ బ్రోచేవారెవరురా అని ఫిక్స్ చేశారు. దర్శకుడు నేను సరే బ్రో అని అనుకునేవాళ్లం. ఈ కథను ఎంచుకోవడానికి నేను ఇందులో నటించడానికి కారణం మిత్ర అనే పాత్ర. ఆ రోల్ అంతగా నచ్చింది. మిత్ర భరతనాట్యం- కూచిపూడి చేయాలి.  ఆ పాత్రలో ఎవరు చేస్తారా? అని ఎదురుచూశాను. అప్పటికే నిన్నుకోరిలో నివేద డ్యాన్సులు చూశాం. అందుకే ఎంపిక చేసుకున్నాం. అన్నాడు.


ఇదే వేదికపై 'పొట్టోళ్లు గట్టోళ్లు' అని అంటారు కదా...అలా నివేదా చాలా కష్టపడి డ్యాన్సులు నేర్చుకుంది. ఒకరోజు నేను కిటికీ నుంచి చూశాను. ఎగిరెగిరి డ్యాన్సులు చేసింది అంటూ నివేదపై సరదా వ్యాఖ్యను చేశారు శ్రీవిష్ణు. ప్రతి అమ్మాయి మిత్రనే. నేను కేవలం ఆడపిల్లల కోసం ఈ సినిమా చేశాను. ప్రతి అమ్మాయి ఈ సినిమాలో మిత్ర ఎదుర్కొనే తరహా సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్య ఏమిటన్నది సినిమాలో చూడండి... అని అన్నారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ వారం ఇంకో రెండు సినిమాలతో పోటీ పడి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: