కాజల్ తెలుగు ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు దాటిపోయిన ఇంకా హాట్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఫిట్నెస్.. గ్లామర్ విషయంలో కాజల్ కు తిరుగేలేదు.  అందుకే 15+ ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా అవకాశాలు సాధించగలుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేయడం కాజల్ కు హాబీ. తన ఫోటోషూట్ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ రీసెంట్ గా ఒక బ్లాక్ డ్రెస్ లో కెమెరాకు ఎడాపెడా పోజులిచ్చింది.


సాధారణంగా ఫోటో షూట్లు చేసే సమయంలో వీలైంతగా అందాలు ధారపోయాలని.. లేకపోతే ఆ ఫోటోలను ఎవరూ పట్టించుకోరనే ఒక అభిప్రాయం ఉంది.  అలాంటి అభిప్రాయాన్ని కాజల్ చెరిపేయాలని కంకణం కట్టుకుందేమో కానీ ఈ ఫోటో షూట్ లు అందాల వడ్డన లేకుండా స్టైలిష్ పోజులతోనే సరిపెట్టింది.బ్లాక్ కలర్ థై స్లిట్ గౌన్ లో కాజల్ ఒక మోడల్ లాగా పోజిచ్చింది. ఈ డ్రెస్ కు ఎడమ షోల్డర్ పై మాత్రం ఒక విండో ఉంది.


వేలికి ఉంగరం తప్ప ఇతర యాక్సెసరీస్ ఏవీ ధరించలేదు. ఓవరాల్ గా మోడరన్ చిక్ లుక్ లో ఉంది. హెయిర్ ను బ్రౌన్ షేడ్ లో స్టైలింగ్ చెయ్యడంతో కాజల్ డిఫరెంట్ గా కనిపిస్తోంది.  జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టినా అందమే అన్నట్టుగా కాజల్ ఏ డ్రెస్ వేసినా అందమే. ఇక కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే శర్వానంద్ 'రణరంగం' లో హీరోయిన్ గా నటిస్తోంది.  తమిళంలో 'కోమలి'.. 'ప్యారిస్ ప్యారిస్' సినిమాల్లో నటిస్తోంది.  శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: