విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. తల్లి శకుంతల .అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది.తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్‌ వెళ్లిపోయారు.

 

తెలుగు సినిమా నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు నరేష్ కు తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె స్వయానా పిన్నమ్మ. సూపర్ స్టార్ మహేష్ బాబు కి స్టెప్-మదర్. 

 

ఏడవ ఏటనే,  పాండురంగ మహత్యం అనే తమిళ సినిమా తో బాలనటిగా చలనచిత్రరంగంలోకి ప్రవేశించారు.

 

2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులులో కెక్కినది.

 

ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు "కృష్ణ" కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.

 

తెలుగు సినిమాకు చేసిన సేవకు గాను, ఈమెకు రఘుపతి వెంకయ్య పురస్కారానికి 2008 లో ఎంపికయ్యారు.

 

ఇండియన్ సినీ వినీలాకాశంలో ప్రముఖ నటుడు, శివాజీ గణేశన్ గారిని డైరెక్ట్ చేసే ఘనత ఇద్దరికే దక్కుతుంది.. ఒకరు "విజయ నిర్మల" గారు, రెండవది.. సహజనటి "సావిత్రి" గారు.

 

నిర్మల గారి సినిమా నిర్మాణం.. 3 లక్షల పెట్టుబడితో, ఒక మలయాళం సినిమాతో మొదలయ్యింది.

 

1998 లో మొదటిసారిగా ఈమె నటించి, నిర్మించిన బుల్లితెర నాటిక పేరు "పెళ్లి కనుక."

 

గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట.


మరింత సమాచారం తెలుసుకోండి: