సీతా రాములు, రాధాక్రిష్ణులు ఇలా పురాణ పురుషుల జంటల గురించి చెప్పుకుంటారు. కానీ నిజ జీవితంలో అదీ సినీ రంగంలో 60 ఏళ్ల పాటు అద్భుతంగా కలసి మెలసి ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే అది క్రిష్ణ, విజయనిర్మలను చెప్పుకోవాలి. ఈ ఇద్దరిదీ అందమైన జంట. క్రిష్ణ పక్కన విజయనిర్మల పేరు లేకపోతే వెలితిగా ఉంటుంది. క్రిష్ణను ఒంటరిగా చూడాలంటేనే బెంగగా ఉంటుంది. అంతలా కలసిమెలసి ఉన్న జంట వీరు.


విజయనిర్మల  క్రిష్ణను పెళ్ళి చేసుకుని ఈ ఏడాదికి సరిగ్గా 50 ఏళ్ళు. ఈ ఇద్దరూ 1969లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. దానికి ముందు సాక్షి సినిమాలో నటించారు. అక్కడ మొదలైన సినీ  బంధం అనురాగ బంధంగా పెనవేసుకుంది. క్రిష్ణ విజయనిర్మల సినీ ప్రస్తానం ఎందరికో ఆదర్శప్రాయం. మాములుగానే పెళ్ళి చేసుకున్న జంటలు విడిపోతున్న రోజులివి. అటువంటిది తళుకుబెళుకుల సినిమా రంగంలో ఓ జంట యాభై ఏళ్ళ పాటు ఆదర్శంగా  జీవించారంటే అది రికార్డ్.


అంతే కాదు ఒకరిని విడిచి ఒకరు లేకుండా ఉండలేరు. అలా ఆ దంపతుకు ఉండేవారు. క్రిష్ణ ఎక్కడికి వెళ్ళినా పక్కన విజయనిర్మల ఉండాల్సిందే. సినీ జీవితంలో కూడా ఈ ఇద్దరూ కలసి 47 సినిమాల్లో జంటగా నటించారు. తొలి చిత్రం సాక్షి అయితె చివరి చిత్రం శ్రీశ్రీ. తెలుగు సినిమా రంగంలో ఈ దంపతులు ట్రెండ్ సెట్టర్. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంటను చూసి తరువాత కాలంలో మరెంతో మంది స్పూర్తిగా తీసుకుని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయితే అందరూ క్రిష్ణ విజయనిర్మల మాదిరిగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఛివరి వరకూ  గడపలేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: