విజయ నిర్మల అంటే విజయానికి మారు పేరు అనే విధంగా పేరు తెచ్చుకుంది.  1950 లో బాలనటిగా మొదటి సినిమా చేసిన విజయ నిర్మల అంచలంచెలుగా ఎదిగింది.  మలయాళంలో కవిత అనే సినిమాకు దర్శకత్వం వహించింది.  ఆ తరువాత 1971లో మీనా సినిమాతో దర్శకురాలిగామారింది .  


తన కెరీర్లో 44 సినిమాలకు దర్శకత్వం వహించింది. ఇందులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.  ఎక్కువభాగం కృష్ణతో చేసినవే ఉండటం విశేషం.  దర్శకురాలిగానే కాకుండా కృష్ణతో కలిసి 41 చిత్రాలలో నటించింది.  కృష్ణతో కలిసి అత్యధిక చిత్రాలలో నటించిన హీరోయిన్ గా విజయ నిర్మల నిలిచింది.  


2009 తరువాత ఆమె సినిమాలు తీయలేదు.  2013 తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసిన తరువాత, ఆ తరహా కుటుంబ కథా చిత్రాన్ని చేయాలని అనుకుంది.  దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.  అందుకో మరి అది సాధ్యం కాలేదు.  అలా తరహా సినిమా తీయకుండానే ఆమె మరణించింది.  


విజయ నిర్మల కెరీర్లో 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది.  అయితే, కెరీర్లో కనీసం 50 సినిమాలకైనా దర్శకత్వం వహించాలని అనుకుంది.  కానీ, ఆ కల కలగానే మిగిలిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: