నటిగా దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా విజయనిర్మల విజయ ప్రస్థానాన్ని గుర్తుకు చేసుకుంటూ అనేకమంది సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆమెకోసం ఏకంగా మహానటుడు ఎస్వీరంగారావుని ఒక సినిమా నుండి తీసివేసిన సంఘటన ఇప్పుడు చాల ఆలస్యంగా ఆమె మరణం సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

తెలుగులో విజయం సాధించిన ‘షావుకారు’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న అప్పటి రోజులలో ఎస్వీఆర్ కోడలి పాత్ర విజయనిర్మలకు దక్కింది. అయితే అప్పటికే మహానటుడుగా పేరుగాంచిన ఎస్వీఆర్ ఆమూవీ సెట్ లో విజయనిర్మలను చూసి ‘ఈ అమ్మాయి ఏమిటి ఇంత సన్నగా ఉంది ఈ పాత్రకు ఆమె సరిపోదు మార్చండి’ అంటూ ఆ షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయాడట. 

దీనితో విజయా సంస్థల లాంటి గొప్ప సంస్థలో తనకు అవకాసం వచ్చినట్లే వచ్చి మిస్ కావడంతో విజయనిర్మల కన్నీటి పర్యంతం అయిందట. ఆమె కన్నీరును చూసి కరిగిపోయిన విజయాసంస్థ అధినేత నాగిరెడ్డి ఆసినిమా నుండి ఏకంగా ఎస్వీఆర్ ను తొలగించి అతడి స్థానంలో అప్పటి ప్రముఖ తమిళ నటుడు ఎస్వీ సుబ్బయ్యను ఎంపిక చేసారట. 

ఈ పరిణామానికి ఎస్వీరంగారావు అప్పట్లో షాక్ అయ్యారట. ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకు ఒక ఫంక్షన్ లో విజయనిర్మల ఎస్వీరంగారావు కలుసుకున్నప్పుడు ‘చూడండి నన్ను వద్దన్నారు ఎప్పటికైనా మీతో కలిసి నటించి మీకే సవాల్ విసురుతా’ అంటూ ఏకంగా ఎస్వీఆర్ కే విజయనిర్మల నవ్వుతూ సవాల్ చేసిందట. అన్నట్లుగానే అప్పట్లో ‘మామకు తగ్గ కోడలు’ అన్న మూవీలో ఎస్వీఆర్ కు కోడలుగా నటించి ఆరోజుల్లోనే విజయనిర్మల విపరీతమైన ప్రశంసలు అందుకుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: