తెలుగు టీ వీ షోల్లో బాగా పాపులర్ అయిన షో "జబర్దస్త్".  ఈ టీవీలో వచ్చే కామెడీ షో  తెలుగు నట చాలా పాపులర్. కేవల టెలివిజన్ లోనే కాకుండా, యూట్యూబ్ లో కాకుండా మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి. అయితే ఈ షో లో ని కమెడియన్లు అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంటారు. కొంతమంది సినిమా నటులు కూడా ఈ షోలో పాల్గొంటారు.


ఈ షో ద్వారా పాపులర్ అయిన చాలా మంది కమెడియన్లలో అప్పారావ్ ఒకరు. ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి జబర్దస్త్ లో అవకాశం ఎలా వచ్చిందో వివరించాడు. అందరి ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా జబర్దస్త్ చూసేవాడట. ఒకసారి జబర్దస్త్ ప్రోగ్రామ్ మేనేజర్ ని కలిసి తన ఫోటోలు ఇచ్చారట.

 

ఆ తరువాత షకలక శంకర్ .. చలాకీ చంటి నన్ను రమ్మని చెప్పారుగానీ, అదే రోజున మా అమ్మాయి పెళ్లి కావడంతో నేను వెళ్లలేకపోయాను. 'వీడుతేడా' సినిమాలో నేను .. షకలక శంకర్ కలిసి నటించాము. ఆ సినిమా దర్శకుడు చిన్నికృష్ణ, 'జబర్దస్త్'లోకి నన్ను తీసుకోమని షకలక శంకర్ తో చెప్పారు. దాంతో మళ్లీ షకలక శంకర్ నన్ను పిలిపించి అవకాశం ఇచ్చారు. అలా ఆయన ద్వారా నేను 'జబర్దస్త్' కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చాను.

 

షకలక శంకర్ టీమ్ లో చేసినందుకు నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. షకలక్ శంకర్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలోని చాలా మంది కమెడియన్లు సినిమాల్లో చేస్తున్నారు. తెలుగు టెలివిజన్ లో అత్యధిక టీఆర్ పి ని సాధిస్తున్న షోగా రికార్డు సృష్టించింది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: