ఈ సంవత్సరం టాలీవుడ్ లీ వచ్చిన స్టార్ సినిమా మహర్షి. మహేష్ బాబు 25 వ చిత్రంగా భారీ అంచనాలతో విడుదల అయింది. ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద ప్రభంజనమే సృష్టించింది. 100 కోట్ల వసూళ్ళూ సాధించి, మహేష్ బాబు కెరియర్లో 100 కోట్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాకి  ముందుగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కలెక్షనల్ పరంగా దూసుకుపోతుంది.

 

అయితే ఈ సినిమా విడుదలయి నేటితో యాభై రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా యాభై రోజుల వేడుకని ఘనంగా చేయాలని ప్లాన్ చేసారు. 200 కేంద్రాలో ఈ సినిమా ఫుల్ గా రన్ అవుతుండడంతో ఈ వేడుకని ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు.మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా యాభై రోజుల వేడుకకి నేచురల్ స్టార్ నానిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సడెన్ గా విజయ నిర్మల గారు చనిపోవడంతో ఈ వేడుకని రద్దు చేసారు.

 

విజయ నిర్మల గారు చనిపోవడంతో ఈ  వేడుకని వాయిదా వేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే  రేపు విజయ నిర్మల గారి అంత్యక్రియలు రేపు జరగనుండడంతో మహేష్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు. మహేష్ కుటుంబం ఇలా విషాదంలో ఉండగా ఇలా సక్సెస్ సంబరాలు నిర్వహించడం బాగోదని భావించి వాటిని రద్దు చేసినట్టు చెబుతున్నారు.

 

విజయ నిర్మల గారు నటిగా, దర్శకురాలిగా చాలా సినిమాలు చేసారు. ఒక మహిళా దర్శకురాలిగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి సినిమా మలయాళంలో వచ్చిన "కవిత" . తెలుగులో క్రిష్ణ హీరోగా " మీనా " సినిమాకి మొదట దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: