ఈ ఏడాది అల్లు అర్జున్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" తర్వాత అల్లు అర్జున్ నుండి ఇంతవరకు సినిమా రాలేదు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఈ ఏడాది ఉంటుందని అనుకున్నారు కానీ  ప్రీ ప్రొడక్షన్ పనులు లేట్ అవడంతో ఆ సినిమా తొందరగా లాంచ్ కాలేదు. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలి ఉన్నాయి.

 

త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్  కనబడుటలేదు చిత్రాన్ని చేయబోతున్నాడు. చేతిలో మూడు సినిమాలున్నా ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల అయ్యేలా లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి కాకుండా డిసెంబర్‌లో విడుదల చేస్తారంటూ తాజాగా కొన్ని వార్తలు వినిపించాయి. జనవరిలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నందున డిసెంబర్ అయితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఫిల్మ్‌మేకర్స్ మాత్రం అవన్నీ వట్టి గాసిప్‌లే అని కొట్టి పారేస్తున్నట్లు తెలిసింది. జనవరి 11 లేదా 13న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.

 

 మహేష్-, అనిల్ రావిపూడి సినిమాకు ఒక రోజు ముందు కానీ ఒక రోజు వెనుకగా గానీ ఈ సినిమా వుంటుందని స్ఫష్టం చేస్తున్నారు. అల్లు అర్జున్ చిత్రం విడుదల మాత్రం సంక్రాంతికి పక్కా అని అంటున్నారు. అభిమానులు మాత్రం అల్లు అర్జున్ సినిమా కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల అయితే వాళ్ళకి ఒకేసారి రెండు పండగలు చేసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: