ప్రముఖ నటి అనుష్క శెట్టి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ సమయంలో గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవల సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్వీటీ కాలికి గాయాలయ్యాయని చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని అనుష్కకు సూచించినట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి.

 

దీనిపై తాజాగా అనుష్క సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నాను. సియాటిల్‌లో సంతోషంగా చిత్రీకరణలో పాల్గొంటున్నాను. లవ్యూ ఆల్‌’ అని స్పష్టం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అనుష్క కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తైంది.

 

ప్రస్తుతం అనుష్క ‘సైలెన్స్‌’(వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమాలో నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌ కథానాయడు. అమెరికాలోని సియాటిల్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అనుష్క బధిర యువతి పాత్రలో కన్పించునున్నట్లు తెలుస్తోంది.

 

ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ అనుష్క ను ఇష్టపడనివారంటూ ఎవరు లేరని చెప్పడంలో సందేహం లేదు.  ఒక్క అరుంధతి సినిమా ఈమె జీవితాన్నే మార్చేసిందని చెప్పవచ్చు. ఒడ్డు, పొడవు, మరియు అభినయం ఈమెకు దేవుడిచ్చిన వారాలని చెప్పవచ్చు. అందుకే అంతలా మన తెలుగు సినీ పరిశ్రమలో పాతుకుపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: