రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే డెఫినెట్‌గా ఆ సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ అని ఫ్యాన్స్ తో పాటు అందరు స్ట్రాంగా ఫిక్సైపోతారు. అంతేకాదు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలోను దేవీ స్టైలే వేరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ దగ్గర్నుంచి యంగ్ హీరో రాజ్ తరుణ్ వరకు అందరి సినిమాలకి పని చేసిన దేవీ ప్రతీ సినిమాలోను తన మార్క్ మ్యూజిక్ తో ప్రేక్షకులను ఊపేస్తాడు. ఇక మెగాస్టార్ తో చేసిన సినిమాలన్ని మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమయింది. 


సురేంద్ర రెడ్డి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాకి అమిత్ మ్యూజిక్ చిరుకి బాగా నచ్చిందట. హిస్టారికల్ మూవీకి ఇటువంటి మంచి సంగీతం అందించడంతో కమర్షియల్ సినిమాకు కూడా న్యాయం చేయగలడని భావిస్తూ తన 152వ సినిమాకి కూడా అతనినే తీసుకోవాలని అనుకుంటున్నారట చిరు. అందుకే తను నెక్స్ట్ చేయబోయే కొరటాల సినిమా కోసం త్రివేది ని తీసుకోవాలని చిరు సూచించినట్టు లేటెస్ట్ న్యూస్.


అయితే చిరు మాట మేరకు త్రివేదికి కొరటాల ఓకే చెప్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొరటాల మొదటి సినిమా నుండి దేవిశ్రీతోనే చేసాడు. కొరటాల - దేవికి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుందన్న విషయం కూడా అందరికి తెలిసిందే. అలానే చిరుకి దేవి అయినా పర్లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈసారి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు చిరు. అందుకే త్రివేదిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. ఒకవేళ అదే గనక జరిగితే దేవీకి చిరు సినిమా మిస్సైనట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: