ప్ర‌తీ వారం లాగా టాలీవుడ్లో ఈ శుక్ర‌వారం మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. గ‌రుడ‌వేగ హిట్ జోష్‌లో ఉన్న సీనియ‌ర్ హీరో, డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి - నివేదా థామస్ – శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా - హ‌రినాథ్ పొలిచ‌ర్ల న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ కెప్టెన్ రానా ప్రతాప్ రిలీజ్ అయ్యాయి. వీటిల్లో క‌ల్కి, బ్రోచేవారెవ‌రురా సినిమాపై స‌రి స‌మానంగా అంచ‌నాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకోవ‌డం, బిజినెస్ ఓకే అనిపించ‌డంతో మంచి అంచ‌నాలే ఉన్నాయి.


ముందుగా క‌ల్కి విష‌యానికి వ‌స్తే రాజ‌శేఖ‌ర్ ఇన్వెస్ట్‌గేష‌న్ ఆఫీస‌ర్‌గా న‌టించిన ఈ సినిమా గ‌రుడ‌వేగ‌తో పోలిస్తే అంచ‌నాలు అందుకోలేదంటున్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఫ‌స్టాఫ్‌ను మ‌రీ స్లోగా న‌డిపించి... స్క్రీన్ ప్లే ప‌రంగా క‌న్‌ఫ్యూజ్ చేశాడంటున్నారు. చివ‌రి 30 నిమిషాలే సినిమాకు హైలెట్ అంటున్నారు. అయితే మ‌రీ తీసిప‌డేయ‌ద‌గ్గ సినిమా కాపోయినా గ‌రుడవేగ స్థాయి సినిమా కాద‌న్న టాక్ వ‌చ్చింది.


శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్, సత్యదేవ్ న‌టీన‌టులుగా మెంట‌ల్ మ‌దిలో ద‌ర్శ‌కుడు  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెర‌కెక్కిన బ్రోచేవారెవ‌రురా కామెడీ క్రైం థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింద‌న్న టాక్ వ‌చ్చింది. సినిమా స‌ర‌దా స‌ర‌దాగా సాగుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అంద‌రిని ఆకట్టుకుంద‌ట‌. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఏ సెంట‌ర్ల‌లో కూడా మంచి వ‌సూళ్లు ద‌క్క‌నున్నాయి.


ఇక జ‌నాలు ఎప్పుడో మ‌ర్చిపోయిన హ‌రినాథ్ పొలిచెర్ల పవర్‌ ఫుల్‌ ఆర్మీ ఆఫీసర్‌ గా న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కెప్టెన్ రాణా ప్ర‌తాప్ ఏ మాత్రం ఆక‌ట్టుకునేలా లేదు. ప‌ర‌మ చెత్త క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా క‌నీసం స‌గ‌టు ప్రేక్ష‌కుడిని కూడా ఆక‌ట్టుకోదు. సో ఈ వారం మూడు సినిమాల్లో బ్రోచేవారెవ‌రురా ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటే క‌ల్కి సెకండ్ ప్లేస్‌లో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: