‘బిగ్ బాస్’ సీజన్ 3 ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈషో పై మ్యానియా నెమ్మది నెమ్మదిగా ఇంకా ప్రారంభం కాకుండానే పెరుగుతోంది. ఈకార్యక్రమానికి సంబంధించిన హోస్ట్ విషయమై క్లారిటీ వచ్చినా ఇంకా   పార్టిసిపెంట్స్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఒక మార్కెట్ లో నాగార్జున తిరుగుతూ ‘బిగ్ బాస్’ హౌస్ కు కావాల్సిన వస్తువులు కొనడం చేస్తున్న వీడియోను రిలీజ్ చేసారు. 

నాగ్ ఏకంగా 25 కేజీల వంకాయలు కొనడం చూసిన ఆషాపు యజమాని ఆశ్చర్యపోతూ ఉంటే 'ఈ సారి నేనే రంగంలోకి దిగుతున్నా' అంటూ నాగార్జున సమాధానం చెప్పి ‘బిగ్ బాస్’ సీజన్ 3 హోస్ట్ తానేనంటూ చెప్పేశాడు. 14 మంది పార్టిసిపెంట్స్ 100 రోజుల షో జరుగబోతున్నట్లుగా ఈవీడియో ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహించి హోస్టింగ్ లో అనుభవంను దక్కించుకున్న నాగార్జున ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 3 ని విజయంతంగా నడపగలడని అంతా భావిస్తున్నప్పటికీ ఎక్కడో చిన్నచిన్న అనుమానాలు నాగార్జున సమర్ధత పై ఇప్పటికీ వెంటాడుతున్నాయి. 

జులై రెండవ వారంలో ఈషో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఇప్పటికే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. వాస్తవానికి ఈషోకి హౌస్ మేట్స్ గా వెళ్ళడానికి చాలామంది అయిష్టత వ్యక్తం చేసినట్లు టాక్. దీనికి కారణం ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎవరైనాసరే ఈసారి సోషల్‌ మీడియాని చాలా గట్టిగా వాడుకోకుండా ఈషోలో మనుగడ లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. 

ముఖ్యంగా ‘బిగ్ బాస్ 2’ సీజన్ లో కౌశల్‌ విజయానికి సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఎంపిక అయిన కంటెస్టెంట్లు ముందుగానే తమ 'ఆర్మీ'ని ప్లాన్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జునకు బుల్లితెర కార్యరమాలను హోస్ట్ చేస్తూ నవ్వించడం శాసించడం అలవాటు అయినప్పటికీ ఈసారి ‘బిగ్ బాస్ 3’ సీజన్ కోసం తయారు అవుతున్న పెద్దపెద్ద సోషల్ మీడియా ఆర్మీలను తట్టుకుని నాగార్జున ఎంతవరకు ఈషోను సక్సస్ చేస్తాడు దానికి అండగా సోషల్ మీడియాలో నాగార్జునకు  అండగా అక్కినేని ఆర్మీ ఎంత వరకు సహకరిస్తుంది అన్న విషయం పై ‘బిగ్ బాస్ 3’ కార్యక్రమం ఆధారపడి ఉంటుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: