పెళ్లి తరువాత సమంత దూసుకుపోతున్నది.  ఒక్క యూటర్న్ సినిమా మినహా అన్ని సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.  ఈ ఏడాది సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలు ఆమె హిట్ ఖాతాలో చేరాయి.  ప్రస్తుతం సమంత ఓ బేబీ సినిమా చేస్తున్నది.  


కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి ఇది రీమేక్.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  సినిమా మొత్తం సమంత భుజాలపైనే ఉన్నది.  ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది.  ట్రైలర్ సూపర్ గా ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకుంది.  


ఈరోజు ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నది.  ఈ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు సురేష్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోంది.  అక్కినేని కోడలు హీరోయిన్ కాబట్టి చీఫ్ గెస్ట్ ఎవరు అనే దానిపై అందరి దృష్టి ఉన్నది.  అక్కినేని కుటుంబం నుంచి ఎవరైనా వస్తున్నారా.. అని ఆలోచిస్తున్నారు.  


లేదా దగ్గుబాటి వారి అమ్మాయి కాబట్టి అటు నుంచి ఎవరైనా వస్తున్నారా ... లేదంటే ఇరు కుటుంబాల నుంచి వస్తున్నారా లేదా బయట నుంచి ఎవరైనా వస్తున్నారా అన్నది తెలియాలి.  జులై 5 న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: