రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇప్పటి వరకు జూనియర్ చరణ్ ల గాయాల సమస్యలు హీరోయిన్స్ సమస్యలకు సంబంధించిన వార్తలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఏకంగా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ సమస్యగా మారబోతున్నాడు. వరస పరాజయాలతో సతమతమైపోతూ ఈమధ్యనే విడుదలైన ‘భరత్’ కూడ ఫ్లాప్ కావడంతో సల్మాన్ ఖాన్ పని అయిపోయింది అన్నస్థాయిలో కామెంట్స్ వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ అలియా భట్ లు కలిసి నటిస్తున్న ‘ఇన్ షలా’ మూవీ షూటింగ్ బెనారస్ చుట్టుపక్కల ప్రాంతాలలో పాటు డెహరాడూన్ ముస్సోరీ ప్రాంతాలలో షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈషూటింగ్ తరువాత ఈమూవీ టీమ్ అమెరికా వెళ్ళి మియామి ఫ్లోరిడా ప్రాంతాలలో ఈమూవీ షూటింగ్ ను ఎటువంటి బ్రేక్ లేకుండా వరసగా తీయబోతున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ సెప్టెంబర్ దాకా కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అలియా భట్ తన ప్రియుడు రణబీర్ తో కలిసి ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్ళిన పరిస్థుతులలో ఆమె జూలై రెండవ వారానికి కూడ తిరిగిరాదు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు అలియా వచ్చి చేరేది సెప్టెంబర్ తరువాత మాత్రమే అని సంకేతాలు వస్తున్నాయి. 

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఎన్ని షెడ్యూల్స్ కొనసాగిస్తున్నా ఆసీన్స్ అన్నీ జూనియర్ చరణ్ ల నేపధ్యంలోనే జరుగుతున్నాయి కాని మెయిన్ హీరోయిన్ అలియా భట్ ఇప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈమూవీ హీరోయిన్ సమస్యలు ఎప్పటికి తీరుతాయో రాజమౌలికే అర్ధంకాని పరిస్థితిగా మారింది అని అంటున్నారు. ముఖ్యంగా అలియా భట్ తన డేట్స్ ఇచ్చే విషయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే తాను ప్రస్తుతం నటిస్తున్న రణభీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్రా’ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండటం రాజమౌళికి బయటకు చెప్పుకోలేని సమస్య



మరింత సమాచారం తెలుసుకోండి: