ఇండియ‌న్ ఫిల్మ్ ల‌వ‌ర్స్‌లో అమీర్ ఖాన్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. అమీర్‌ఖాన్ త‌న ప్రతి ఫిల్మ్‌లోనూ సామాజిక అంశాల‌తో ముడిపడిన కొన్ని సీన్లను చూపిస్తాడు. త‌ను మంచి యాక్టెర్ అలాగే అంత‌కు మించిన మంచి డైరెక్టర్‌. ఇంతటి గుడ్‌విల్‌ను సంపాదించుకున్న అమీర్‌ఖాన్ త‌న లెటేస్ట్ ఫిల్మ్‌లో హిందువుల మ‌నోభావాల‌ను అగౌర‌ప‌రిచాడంటూ కేసు న‌మోదు అయింది. దీన్ని ఎవ‌రూ న‌మ్మక‌పోయానా సాక్ష్యాల‌తో స‌హా క‌ళ్ళ మందు క‌న‌ప‌డుతున్నయి. 

ఇదంత అమీర్‌ఖాన్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ పి.కె లో జ‌రిగింది. ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పీకే. ఈ మూవీలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారు. చాందిని చౌక్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా  శివుడు వేషంలో ఉన్న వ్యక్తి ఇద్దరు బురఖాలతో ఉన్న మహిళలని రిక్షాలో ఎక్కించుకొని రిక్షా తొక్కుతూ ఉండే సన్నివేశం చిత్రీకరించారు. ఆ షూటింగ్ స‌మ‌యంలో అక్కడి ఉన్న సాధార‌ణ ప్రజ‌ల మ‌నోభావాలు దెబ్బతిన్నాయి. వెంట‌నే చిత్ర యూనిట్ 'పై ఐ ఫై సి 295 ఎ' (సంప్రదాయాలను అవమానించడమ్, వాటికి నష్టం కలిగించడం), '153 ఎ' (మత విద్వేషాలను రగిలించడం) సెక్షన్స్‌పై కేసు నమోదు జ‌రిగింది. దీంతో ఈ కేసు నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి చిత్ర యూనిట్ విశ్వ ప్రయ‌త్నాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: