తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్టార్ హీరోలు ఉన్నారు. ఈ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యాడు. ఇకపై పవన్ కల్యాణ్ తనకు సినిమాల్లో నటించాలనే ఉద్దేశం లేనట్లు మీడియాతో చెప్పాడు. ప్రభాస్ బాహుబలి 2 సినిమా తరువాత సాహో సినిమాకోసం రెండేళ్ళకు పైగా సమయం తీసుకున్నాడు. రామ్ చరణ్ , ఎన్టీయార్ రాజమౌళి సినిమాతో బిజీ అయిపోయారు. 
 
ప్రస్తుతం మహేశ్ బాబు, అల్లు అర్జున్ మాత్రమే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి సినిమాకు దాదాపుగా రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నాడు. ఇలా స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్ళ సమయం తీసుకోవటం వలన సరైన సినిమాలు థియేటర్లలో లేక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్ల ఓనర్లకు థియేటర్ నిర్వహణ ఖర్చులు కూడా రావట్లేదు. 
 
మీడియం హీరోలైన నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నిఖిల్ సినిమాలు వేగంగానే చేస్తున్నా సినిమా హిట్టైతే మాత్రమే కలెక్షన్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు సినిమాలు వేగంగా చెయ్యాలి. ఒక సినిమాలో నటిస్తుండగానే తరువాత సినిమాకు అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. సంవత్సారానికి కనీసం రెండు సినిమాలైనా విడుదల చేయాలి.ఈ విధంగా చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది.  మరి స్టార్ హీరోలు ఈ విధంగా ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: