'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ఇటీవల షాహిద్ కపూర్ ని అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ 'కబీర్ సింగ్' లో అద్భుతంగా చూపించడంతో సినిమాను ఓ రేంజ్ లో తెరకెక్కించడంతో సినిమా ఇటీవల విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన హిట్ కొట్టింది. సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసి చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఆశ్చర్యపోతున్నారు.


ఇప్పటికే వంద కోట్లు సాధించిన 'కబీర్ సింగ్' 200 కోట్లు సాధించే దిశగా పరుగులు తీసింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తుంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ వర్గాలు ఈ ఏడాది టాప్ 3 గ్రాసర్స్ లో ఈ సినిమా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ తో సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 'కబీర్ సింగ్' సక్సెస్ గురించి విన్న సల్మాన్ ఖాన్.. సందీప్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.


అంతేకాకుండా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ టీసిరీస్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా కూడా ఈ సినిమా గురించి ఏ వార్త బయటకు రాలేదు. మొత్తం మీద అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ షాహిద్ కపూర్ తో సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: