యువ హీరో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా రణరంగం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. కొద్ది నిమిషాల క్రితం రణరంగం టీజర్ రిలీజైంది. అనుకున్నట్టుగానే టీజర్ అంచనాలను అందుకుంది.


దేవా పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడు. సినిమాలో కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ లో దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది.. మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలని అంటాడు శర్వానంద్. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. 


లాస్ట్ ఇయర్ పడి పడి లేచే మనసు సినిమా భారీ అంచనాలతో వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అందుకే రణరంగంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు శర్వానంద్. టీజర్ చూస్తే శర్వానంద్ కు ఈ సినిమా పక్కా హిట్ ఇచ్చేలా ఉంది. డైరక్టర్ సుధీర్ వర్మ కూడా ఈ సినిమాను కసితో తెరకెక్కించాడని చెప్పొచ్చు. 


త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ రణరంగం ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ప్రశాంత్ పిల్లై మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అవనుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: