మలయాళ నటీమణులకు తెలుగులో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దశాబ్దం క్రితం తెలుగులో అసిన్‌, నయనతార, ప్రియమణి వంటి వారందరూ మల్లువుడ్‌ భామలే. ఇప్పుడు టాప్‌ హీరోలతో జతకడుతోన్న నిత్యామీనన్‌, కీర్తి సురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌, నివేదా థామస్‌, ప్రియా పి వారియర్‌ వంటివారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు నటి అనఘ పరిచయం కాబోతుంది.

 

కార్తికేయ సరసన 'గుణ 369'లో అనఘ జోడీ కడుతున్నారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌జీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

 

దర్శకుడు మాట్లాడుతూ.. కంటెంట్‌ డ్రైవన్‌ ఫిల్మ్స్‌ తెలుగులో రావడం లేదనుకునేవారికి సమాధానం చెప్పే విధంగా మా సినిమా ఉంటుంది. టీజర్‌ చూసిన వారందరూ అదే మాట అంటున్నారు. టీజర్‌లో హీరోయిన్‌ని చూసినప్పటి నుంచి చాలామంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఆమె పేరు అనఘ. తమిళ చిత్రం 'నట్పే తునై'లో అనఘ నటించారు. అందులో కొన్ని సీన్లు చూసి ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. చాలా బాగా పెర్ఫార్మ్‌ చేసింది అని అన్నారు.

 

నిర్మాతలు మాట్లాడుతూ.. నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర ఆమెది. ఆమె స్వతహాగా క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావడంతో, డ్యాన్సుల విషయంలోనూ చాలా హెల్ప్‌ అయింది. ఫక్తు కమర్షియల్‌ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి. మా హీరో కార్తికేయ సరసన చక్కగా సరిపోయింది. కాగా, ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: