శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రణరంగం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.  ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
జూన్ 29 వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు 'రణరంగం' టీజర్ ను విడుదల చేశారు. 

ఈ సినిమాలో శర్వా ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  దానికి తగ్గట్టే శర్వా ఈ టీజర్ పోస్టర్స్ లో రఫ్ లుక్ లో ఉన్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అన్నీ పోస్టర్స్ లోనూ శర్వా లుక్ కంప్లీట్ మాసీగా ఉండటం విశేషం. అంతేకాదు శర్వా కూడా ఈ తరహా పాత్ర పోషించడం ఇదే మొదటిసారి. అందుకే ఈ సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక శర్వా కూడా గత సినిమా పడి పడి లేచె మనసు డిజాస్టర్ అవడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం.  యువకుడిగా.. మధ్యవయస్కుడైన డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో శర్వా నటన సినిమాకే హైలైట్ అవుతుందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ ఆగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగష్టు 2 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం.   


మరింత సమాచారం తెలుసుకోండి: