ఈమధ్య కాలంలో రాఘవేంద్రరావు తనకు పెరిగిన వయసు రీత్యా ఎంతటి గొప్పవారి పై అయినా అవకాశం వస్తే చాలు చురకలు అంటించకుండా వదలడంలేదు. ఇలాంటి సందర్భమే నిన్న మళ్ళీ ‘ఓ బేబి’ ఫంక్షన్ లో జరిగింది. ‘ఓ బేబి’ సినిమాకు కీలకమైన నిర్మాత సురేష్ బాబు అయినప్పటికీ  మరో నలుగురు ఈసినిమాకు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీతో పాటు రామానాయుడు కుటుంబంలో కూడ రాఘవేంద్రరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనితో పెద్దమనిషి తరహాలో ఆయన ఒక జోక్ వేసినా కాదు అనలేని స్థితి అక్కినేని దగ్గుబాటికుటుంబాలది. ‘ఓ బేబి’ మూవీ తాను చూశానని ఆమూవీ చాల బాగా వచ్చిందని చెపుతూ ఈమూవీకి నిర్మాతలుగా వ్యవహరించిన అందరికీ మంచి లాభాలు వస్తాయని రాఘవేంద్రరావు కామెంట్ చేసాడు.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇస్తూ రాఘవేంద్రరావు రానా వంక చూస్తూ 'రానా, డాడీకి చెప్పు అక్కౌంట్స్ సరిగ్గా చెప్పమని అసలే సరిగ్గా చెప్పడు. నా వంతు వాటా కూడా వుంది' అని అనగానే ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు విపరీతంగా నవ్వారు. 

సురేశ్ బాబు సినిమాలకు సంబంధించి లెక్కలను వివరంగా చెప్పడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇలా ఓపెన్ గా రాఘవేంద్రరావు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల దర్శకత్వం పూర్తిగా తగ్గించివేశాక సినిమాలకు సహ నిర్మాతగా పరోక్షంగా వ్యవహరిస్తూ రాఘవేంద్రరావు అనేక సినిమాలలో పెట్టుబడి పెడుతున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ తో సురేశ్ బాబు వ్యవహార శైలి ఎంతవరకు మారుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: