గడ్డం చక్రవర్తిని ముద్దుగా జేడీ అని పిలుస్తుంటారు.  శివ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.  వర్మతో కలిసి చాలా సంవత్సరాలు ఫాలో అయ్యాడు. వర్మ కార్పొరేషన్ సంస్థలో భాగస్వామ్యుడిగా ఉండి అనేక సినిమాలు చేశారు.  ఈ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  


నటుడిగా చేస్తూనే సినిమాలకు దర్శకత్వం వహించాడు జేడీ.  జేడీ హీరోగా గులాబీ సినిమా చేయాలని అనుకున్న సమయంలో ఆయన దగ్గర డబ్బులేదు.  కృష్ణవంశీ చెప్పిన కథ జేడీకి నచ్చింది.  ఈ కథను తీసుకెళ్లి దువ్వాసి మోహన్ కు చెప్పి ప్రొడ్యూస్ చేయమంటే.. ఆయన రాజశేఖర్ తో అయితే వర్కౌట్ అవుతుంది అని చెప్పారట.  


చేసేది లేక జేడీ తన ఇంటిని అమ్మి సినిమా చేయాలని అనుకున్నాడు.  ఈ విషయం వర్మకు తెలిసింది.  వెంటనే జేడీని పిలిచి.. సినిమా కోసం ఇల్లు అమ్మాల్సి అవసరం లేదు.. తాను సినిమాకు ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు.  అనుకున్నట్టుగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు.  


అలా ఏర్పాటు చేసిందే రామ్ గోపాల్ వర్మ కార్పొరేషన్.  ఈ సంస్థలో కొంత మొత్తం డబ్బును ఉంచి ఆ డబ్బుతో సినిమాలు చేస్తున్నారు.  ఇప్పటికి అలానే సినిమాలు చేస్తున్నారు.   మూవీ హిట్ అవుతుందా లేదా అన్నది తరువాత సంగతి.  కథ నచ్చిందా.. సినిమా చేశామా అన్నదే ముఖ్యమని అంటున్నారు జేడీ.  వర్మ నిర్మాతగా జేడీ దర్శకత్వంలో త్వరలోనే మరో సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: