పెళ్లి తరువాత సమంత వరస హిట్స్ తో దూసుకుపోతున్నది.  సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.  ఈ రెండు హిట్స్ తరువాత ఓ బేబీ చేస్తున్నది.  ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.   నిన్న ప్రీ రిలీజ్ వేడుకలో సమంత మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది.  

సమంత కోసమే ఆ డ్రెస్ ను డిజైన్ చేశారా అనిపించే విధంగా ఉన్నది.  కాస్త గ్లామర్ గా కనిపిస్తూ.. హీరోయిన్ గా ఎలా ఉండాలో అలా ఉంటూ తన మాటలతో ఆకట్టుకుంది.  తన గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొగుడుతుంటే.. సమంతను చూడాలి ఎలా ఉన్నదో.  

దర్శకురాలు నందిని రెడ్డి సమంతను గురించి అద్భుతంగా పొగిడింది.  తనకోసమే సినిమా తీసినట్టుగా చెప్పింది.  ఓ హాలీవుడ్ మూవీలో చేసినట్టుగా అనిపించిందని చెప్పింది సమంత.  ఈ సందర్భంగా సమంత ఫోటో షూట్ చేసింది.  ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.  నటనతో పాటు అందానికి సమంత పెద్దపీట వేస్తుంది అని సినిమాతో అర్ధం అవుతుంది.  రాఘవేంద్ర రావు వంటి దర్శకుడే తన సినిమాలో గెస్ట్ రోల్ చేయాలనీ కోరడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: