జూలై 18న రిలీజ్ కానున్న ఇస్మార్ట్‌ శంకర్ టోటల్ ఈ సినిమా టీం ఫ్యూచర్ కు కీలకంగా మారింది. ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి హీరో రామ్, హీరోయిన్ నితిన్ అగర్వాల్ ఎలా వరుసపెట్టి అందరూ ప్లాపుల్లోనే ఉన్నారు. ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికే వరుసగా ఏడు డిజాస్టర్ లతో తన డిజాస్టర్ రికార్డు కంటిన్యూ చేస్తున్నాడు. ఒకప్పుడు పూరి సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉండేవి. ఇప్పుడు నిర్మాతలు కూడా పూరికి ఛాన్సులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.


ఇక హీరో రామ్ పోతినేని పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. నేను శైలజ సినిమా తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాతో రామ్ హిట్ కొట్టకపోతే మార్కెట్ మరింత ఘోరంగా ప‌డిపోయే ప్రమాదం ఉంది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్ల విషయానికి వస్తే నిధి అగర్వాల్ రెండు సినిమాలు చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో శంకర్ సినిమా హిట్ ఆమె కెరీర్‌కు కీలకం కానుంది.


ఇక మరో హీరోయిన్ కూడా తెలుగులో అదిగో సినిమాతో పాటు సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాల్లో చేయగా ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వ‌క‌పోతే ఆమెకు ఛాన్స్ ఇచ్చేవారే ఉండ‌రు. వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మ‌ణి మ్యూజికల్ హిట్ ఎప్పుడు ఇచ్చాడో కూడా గుర్తులేదు. ఈ లెక్క‌న చూస్తే వీరంద‌రి కెరీర్‌లో చాలా రోజుల త‌ర్వాత హిట్ వ‌స్తుందో ?  లేదో జూలై 18న తేలిపోనుంది. వీళ్ల‌కు హిట్ రాక‌పోతే వీళ్ల‌లో చాలా మందికి నెక్ట్స్ అవ‌కాశాలు క‌ష్ట‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: