సినిమా రంగంలో రాణించాలని కలలు కంటూ ఆ కలలను సాకారం చేసుకోవడానికి హైదరాబాద్ వస్తుంటారు.  ఫిలిం స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు.  అవకాశాలు వస్తాయని ఎదురు చూసి చూసి విసిగిపోతుంటారు.  పోరాటం చేస్తే కొందరికే అవకాశాలు వస్తాయి.  వచ్చిన అవకాశాలను నిలబెట్టుకుంటే మరో అవకాశం వస్తుంది.  


సినిమా రంగంలో ఇవన్నీ కామనే.  పైగా అవకాశాలు వచ్చే సమయంలో మహిళలైతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అవకాశాలు ఇస్తామని చెప్పి ఎలా వాడుకుంటారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు.  దీనిపై పోరాటాలు కూడా జరుగుతున్నాయి.  ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ కు మిస్సింగ్ భయం పట్టుకుంది.  


గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో నటీమణులు మిస్సింగ్ అవుతున్నారు.  కొన్నిరోజుల క్రితం లలితా అనే ఆర్టిస్ట్ మిస్సింగ్ అయినట్టు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ దాఖలైంది.  ప్రస్తుతం ఇది ఇన్వెస్టిగేషన్ స్థితిలో ఉన్నది.  ఇదిలా ఉంటె, రీసెంట్ గా మరో నటి మిస్సింగ్ అయినట్టు సమాచారం.  సుమ అనే 22 సంవత్సరాల టివి నటి మిస్సింగ్ అయ్యినట్టు టీవీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. 


ధర్మవరం లలితా తరహాలోనే ఈ నటి కూడా మిస్సింగ్ అయినట్టు తెలుస్తోంది.  అయితే, ఈమె ఏ ఏ సినిమాలు చేసింది.. ఏ ఏ సీరియళ్లు చేసింది అనే విషయం తెలియాలి.  మహిళలపై వేధింపుల విషయంలో చట్టాలను తీసుకొస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఈ మిస్సింగ్ లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: