స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రంతో సినిమా సెట్స్ మీద ఉండగా ఆ తర్వాత సుకుమార్, వేణు శ్రీరాం డైరక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఆల్రెడీ స్క్రిప్ట్ ఫైనల్ కాగా త్వరలో ఆ సినిమాకు ముహుర్తం పెట్టాలని చూస్తున్నారు.  


ఇక ఇదే కాకుండా వేణు శ్రీరాం డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా వస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. అంటే ఒకటి యంగ్ ఏజ్ కాగా మరోటి మిడిల్ ఏజ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.


బన్ని కెరియర్ లో మధ్య వయస్కుడి రోల్ చేస్తున్న మొదటి సినిమా ఇదే. అందుకే ఆ పాత్ర కోసం స్పెషల్ గెటప్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో ఆ పాత్రకు బన్ని విగ్ వాడనున్నాడని తెలుస్తుంది. ఇన్నేళ్ల కెరియర్ లో ఇప్పటివరకు సినిమాకు తగినట్టుగ హెయిర్ స్టైల్ చేయించుకున్న అల్లు అర్జున్ ఐకాన్ సినిమాకు ఫస్ట్ టైం విగ్ పెట్టుకుంటాడని తెలుస్తుంది. 


అల్లు అర్జున్ స్పీడుకి స్టార్ హీరోల గుండెల్లో గుబులు మొదలైంది. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కాబట్టి బన్ని మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇక ఎలాగు త్రివిక్రం సినిమా కూడా పక్కా హిట్ అంటున్నారు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్టు కొట్టాయి. సో ఈసారి హ్యాట్రిక్ మూవీ కూడా ఆ హిట్ రిపీట్ అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: