మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసింది.  సినిమాపై అంచనాలు పెంచింది.  మెగాస్టార్ చిరంజీవి ఇందులో తెలుగు స్వతంత్ర సమరయోధుడిగా కనిపిస్తున్నారు.  అక్టోబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతున్నది.  


ఆగష్టు 22 వ తేదీన సైరాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం.  అదే రోజున కొరటాల...మెగాస్టార్ మూవీకి సంబంధించిన అనౌన్సమెంట్ కూడా ఉండబోతుంది.  అయితే, కొరటాల.. మెగాస్టార్ సినిమాను మొదట జులై లో స్టార్ట్ చేసి... ఆగష్టు 22 వ తేదీకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అనుకున్నారు.  


కానీ, సైరా నుంచి దృష్టి మరల్చకుండా ఉండేందుకుగాను కొరటాల సినిమాను అక్టోబర్ కు వాయిదా వేసుకున్నారని సమాచారం.  అక్టోబర్ లో సినిమా స్టార్ట్ చేస్తే... సంక్రాంతికి రిలీజ్ ఉండదు.  సమ్మర్ లో రిలీజ్ ఉంటుంది.  ఉగాది రోజున సినిమా రిలీజ్ కావొచ్చు.  


మెగాస్టార్ కోసం కొరటాల ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసుకున్నారు.  ఇందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో చిరంజీవి కనిపిస్తున్నారు.  అందులో ఒకటి రైతు పాత్ర కాగా, రెండోది ఎన్ఆర్ఐ పాత్ర. ఇందులో అనసూయ కీలక పాత్ర చేస్తున్నది. మిగతా నటీనటులు ఎవరు అన్నది త్వరలోనే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: