''ది లయన్‌ కింగ్‌'' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కార్టూన్‌ నెట్‌వర్క్‌ కామిక్‌ సీరియల్‌గా మొదలైన ‘లయన్‌ కింగ్‌’ని 2డీ యానిమేటెడ్‌ సినిమాగా 1994లో విడుదల చేశారు. ఈ యనిమాటెడ్ సినిమా డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాని 3డీ యానిమేషన్ తో రిలీజ్ చేస్తున్నారు. 


బాలీవుడ్ లో షారుక్ ఖాన్, తెలుగులో స్టార్ హీరోస్ రవి శంకర్, నాని, బ్రహ్మనందం, అలీ, జగపతిబాబు లాంటి హీరోలు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. జాన్.ఫేవ్రాయు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో డోనాల్డ్ గ్రోవర్, రోజెన్, ఏజియోఫర్ ప్రధాన పాత్రలో నటించారు. గత సంవత్సరం అక్టోబర్ లో ఇంగ్లీష్ లో ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సింబ ఇప్పుడు తెలుగులోనూ విడుదలై అందరి మనసులను దోచుకుంటుంది.


భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 19న విడుదల కానుంది. ఇదే సమయంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో సినీ అభిమానులు ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'ది లయన్ కింగ్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో జగపతిబాబు విలన్ కు డబ్బింగ్ చెప్పరూ. రిలీజ్ కు ముందే అంచనాలు పెంచిన సింబ రిలీజ్ తరువాత ఎంతటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇంకెందుకు ఆలస్యం సింబ ట్రైలర్ ను చూసేయండి..



మరింత సమాచారం తెలుసుకోండి: