విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ సినిమా నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రీసెంట్‌గా కూడా ఓ సాంగ్ రిలీజైంది. కానీ ఇది కేవలం సంగీతంతోనే కాదు, టేకింగ్ తో కూడా ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంది. డియర్ కామ్రేడ్ సినిమా నుంచి రిలీజైన కాలేజ్ క్యాంటీన్ సాంగ్ ను సింగిల్ టేక్ లో పిక్చరైజ్ చేశారు. సాంగ్ తో పాటు టేకింగ్, కొరియోగ్రఫీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు లిరికల్ వీడియోలు మాత్రమే విడుదల చేస్తూ వచ్చారు. మధ్యమధ్యలో సినిమా క్లిప్స్ చూపించారు. కానీ కాలేజ్ క్యాంటీన్ సాంగ్  ను మాత్రం టోటల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి కారణం ఈ సాంగ్ సింగిల్ టేక్ షాట్ కావడమే. వీడియోలో తన కాలేజ్ గ్యాంగ్ తో కలిసి ఫుల్ గా హంగామా చేశాడు హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇందులో చిన్న డిసప్పాయింట్ మెంట్ కూడా ఉంది. అది ఏంటంటే ఈ వీడియోలో హీరోయిన్ రష్మిక ఎక్కడా కనిపించకపోవడం.

ఇక ఈ సాంగ్ చూస్తే, శివ సినిమాలో క్యాంటీన్ సాంగ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. కార్తీక్ పాడిన ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జులై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: