అక్కినేని కుటుంబానికి కోడలు సమంత. అంతే కాదు, ఇండస్ట్రీలో మరో బిగ్ ఫ్యామిలీ దగ్గుబాటి వారికీ బంధువే. దగ్గుబాటి బ్రదర్స్ కు కూతురు వరస అన్నమాట. అయితే అటు దగ్గుబాటి రామానాయడు మనవలు చైతూ కి, రానా కు కానీ, కొడుకు వెంకటేష్ కు కానీ దక్కని అదృష్టం సమంతకు దక్కింది. ఈ విషయం స్వయంగా హీరో రానానే నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. నిజమే మరి కొన్ని నిజాలని ఒప్పుకొని తీరాల్సిందే.

ఈ సంవత్సరం( 2019 )తో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ యాభై ఏళ్ల మైలురాయిని దాటబోతోంది. ఈ సందర్భంగా నిర్మించిన సినిమా ఓబేబీ. అయితే తమ సంస్థ యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమ నిర్మాణంలో వస్తున్న సినిమా పోస్టర్ మీద బాబాయ్ వెంకటేష్ ఫోటో కానీ, తన ఫోటో కానీ, చైతన్య ఫోటో కానీ లేదని, సమంతకు మాత్రమే ఆ అదృష్టం దక్కిందని రానా ఒప్పుకున్నారు.
అది కూడా నిజమే.

అంతే కాదు, వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇవ్వాళ దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీల్లో సమంత కు వున్న క్రేజ్ ఎవరికీ లేదు. అటు నాగ్, చైతూలు కానీ, ఇటు రానా, వెంకటేష్ లు కానీ ప్రస్తుతం సమంత కు వున్న క్రేజ్ ను బీట్ చేయలేరు. కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినా ఓ బేబీకి విపరీతమైన క్రేజ్ వస్తోంది అంటే కారణం సమంతనే కదా. ఒకరకంగా చెప్పాలంటే మనం సినిమానుంచి సమంత అక్కినేని ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్‌గా అయిపోయింది. తను నటించిన మనం పెద్ద హిట్. అలాగే నాగా చైతన్యని పెళ్ళి చేసుకున్నాక కలిసి నటించిన మజిలీ కూడా పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇందులో సమంత కున్న క్రేజ్ చాలా హెల్ప్ అయిందని ఇండస్ట్రీ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: