'మణికర్ణిక' తర్వాత బాలీవుడ్ స్టార్ అండ్ కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన హిందీ సినిమా 'మెంటల్ హై క్యా'. ఈ సినిమాని మన తెలుగు దర్శకుడు, దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా జులై 26న విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయగా టైటిల్ విషయంలో పెద్ద వివాదం రావడంతో ట్రైలర్ విడుదలను క్యాన్సిల్ చేశారు. 

ఇండియన్ సైక్రియాట్రిస్టు సొసైటీ వాళ్ళు, పలువురు టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా మొదట కంగనా రనౌత్ టైటిల్ ను మార్చేందుకు ఒప్పుకోనంది. కానీ ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో టైటిల్ ను మార్చుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా మార్చిన టైటిల్ ను యూనిట్ సభ్యులు వెళ్లడించారు. మెంటల్ పదాన్ని కాస్త మార్పు చేసి జడ్జిమెంటల్ అనే పదాన్ని యాడ్ చేశారు.

మెంటల్ హై క్యా టైటిల్ ను కాస్త 'జడ్జిమెంటల్ హై క్యా' అంటూ మార్చారు. టైటిల్ మార్చిన యూనిట్ సభ్యులు ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సినిమాలో కంగనా హీరోయిన్ గా నటించగా రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించాడు. మెంటల్ హై క్యా టైటిల్ తో సినిమాకు బాగా పబ్లిసిటీ వచ్చింది. ఇలాంటి సమయంలో టైటిల్ ను మార్చాల్సి రావడంతో మెంటల్ ను జడ్జిమెంట్ చేసి సినిమాకు డామేజ్ అవకుండా జాగ్రత్త పడ్డారు. తెలుగులో దర్శకుడిగా సక్సెస్ అవ్వలేక పోయిన ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాతో బాలీవుడ్ లో తన మొదటి సక్సెస్ ను దక్కించుకునేలా ఉన్నాడంటూ సినీ వర్గాలు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: