బుల్లి తెరమీద ఆకట్టుకుంటున్న సెక్సీ అండ్ హాట్ యాంకర్స్ లో ప్రత్యేకంగా చెప్పాల్సింది శ్రీముఖి గురించి. తను చిట్టి పొట్టి డ్రెస్సులేసుకొని చేసే అల్లరితో షో రేటింగ్స్ బాగా పెరుగుతున్నాయనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. ఒకటి కాదు నాలుగైదు షోలతో శ్రీ ముఖి బుల్లి తెర మీద యమా బిజీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీముఖి బుల్లి తెరకు దూరం కానుందనే వార్త బాగా స్ప్రెడ్ అయింది. పటాస్ షో నుండి బయటకు వచ్చేసిందని బిగ్ బాస్ సీజన్-3లో పార్టిసిపేట్ చేస్తున్నందుకే ఈ షో నుండి వచ్చేసిందని అన్నారు. 

అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలీదుగాని శ్రీముఖి లేటెస్ట్ గా హాట్ హాట్ ఫొటో షూట్స్ తో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోస్ చూసిన వాళ్ళందరు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందేమోనని సందేహంగా ఉన్నారు. ఎందుకంటే శ్రీముఖి కేవలం యాంకర్ మాత్రమే కాదు జులాయి, నేను శైలజా, జెంటిల్ మాన్ వంటి సినిమాల్లోనూ మంచి పాత్రలు పోషించింది. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో క్యారెక్టర్స్ పరంగా కాస్త వెనకబడ్డది శ్రీముఖినే. రష్మీ హీరోయిన్‌గా మంచి రొమాంటిక్ క్యారెక్టర్స్ చేసి మంచి గుర్తింపును పొందిన సంగతి తెలిసిందే.

ఇక అనసూయ కూడా హీరోయిన్‌గా కాకా పోయినా రంగమ్మత్త లాంటి మంచి పాత్రలు పోషిస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది. అందుకే శ్రీముఖి కూడా సిల్వర్ స్క్రీన్ మీద తన సత్తా చాటాలనుకుంటున్నట్టుంది. అందుకే హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ తో జనాలకు పిచ్చెక్కిస్తోంది. ఇక రీసెంట్‌గా శ్రీముఖి ఫొటోస్ చూసినవాళ్ళంతా ఏదో సినిమాలో శ్రీ ముఖి హీరోయిన్‌గా చేస్తున్నట్టుందని కూడా చెప్పుకుంటున్నారు. మరీ ఈ హాట్ ఫొటో షూట్స్ ఎందుకో శ్రీముఖినే  చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: