బాలకృష్ణ మాస్ హీరో.  టైటిల్స్ కూడా మాస్ ను ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి.  గతంలో బాలకృష్ణ కుటుంబ కథా చిత్రాల్లో నటించారు.  రైతుగా పల్లెటూరికి సంబంధించిన సినిమాలు ఎన్నో చేశారు. అయన నటించిన సినిమా పేర్లను ఇప్పుడు చాలామంది హీరోలు తమ సినిమా పేర్లుగా వాడుకుంటున్నారు.  


బాలకృష్ణ హీరోగా చేసిన బంగారు బుల్లోడు సినిమా టైటిల్ ను ఇప్పుడు అల్లరి నరేష్ తన సినిమా పేరుగా పెట్టుకున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.  మహర్షి సినిమా తరువాత అల్లరి నరేష్ కు డిమాండ్ పెరిగింది.  ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  కానీ, కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు.  


ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.  ఈ కసితో ఈ హీరో కొత్త సినిమా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటె, సూపర్ హిట్ సినిమాల్లోని సాంగ్స్ ను రీమిక్స్ చేయడం పరిపాటిగా వస్తున్నది.  గతంలో ఎన్నో సినిమాల్లోని పాటలు రీమిక్స్ చేశారు.  


ఇందులో అల్లరి నరేష్ ముందు ఉన్నాడు.  అప్పటి సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నింటినో తన సినిమాల్లో రీమిక్స్ చేసి వాడుకున్నారు.  ఇప్పుడు మరో హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారు.  స్వాతిలో ముత్యమంతా సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారు.  ఇది బంగారు బుల్లోడు సినిమాలోని సాంగ్ కావడం విశేషం.  ఇలా బాలయ్యను రెండు విధాలుగా వాడుకుంటున్నాడు అల్లరి నరేష్.  


మరింత సమాచారం తెలుసుకోండి: