రానా దగ్గుబాటి పెద్దగా పరిచయం అక్కరకు లేని సెలబ్రెటీ . మొదటి నుంచి సినీ కెరీర్ లో తనకంటూ వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ ఫుల్ నటుడిగా నిరూపించుకుంటున్నారు . ఒక వైపు హీరో పాత్రలను పోషిస్తూనే, మరొకవైపు విలన్ పాత్రలోనూ అలరిస్తున్నాడు . ఇక బాలీవుడ్ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటించే రానా, తన  కెరీర్ ఉరుకులు , పరుగులు అన్నట్టు కొనసాగిస్తున్నాడు .


ఇప్పుడు దగ్గుబాటి వారి అబ్బాయి తమిళం లో ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ చెప్పినట్లు తెలుస్తోంది . ఆర్య , రానా లు హీరోలుగా నటించే ఈ సినిమా కు కబాలి , కాల చిత్రాల దర్శకుడు రంజిత్ పా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం . కబాలి సినిమా ద్వారా రంజిత్ పా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఈ సినిమా ఆశించిన స్థాయి లో  విజయం సాధించకపోయినా , రంజిత్ ప్రతిభ పై నమ్మకం తో కాల సినిమాకు అవకాశం ఇచ్చాడు  సూపర్ స్టార్ రజనీ.


రజనీ తదుపరి చిత్రం కాల ద్వారా సక్సెస్ అందుకున్న రంజిత్ పా, తన తదుపరి చిత్రంగా మల్టీ స్టారర్ రూపొందిస్తుండడం , అందులోను ఇద్దరు వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు ఎప్పుడు రెడీ గా ఉండే నటులను ఎంపిక చేసుకోవడం తో , ఈ సినిమా పై కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది .


మరింత సమాచారం తెలుసుకోండి: