గతం లో టాలీవుడ్ కింగ్ నాగార్జున కు సోగ్గాడే చిన్నినాయన వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తాజాగా నాగార్జునతో బంగార్రాజు అనే సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం నాగార్జున మన్మధుడు సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో నాగార్జున బంగార్రాజు సినిమాపై ఫోకస్ పెట్టారు.


ఈ సినిమాలో తన పక్కన హీరోయిన్ గా మొదట కాజల్ అని అందరూ అనుకున్న సమయంలో పూజా హెగ్డే ని తీసుకుంటే బాగుంటుందని నాగార్జున డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కి చెప్పడంతో డైరెక్టర్ కాజల్ కి ఇచ్చిన ఛాన్స్ వెనక్కి తీసుకొని పూజా హెగ్డే ని బంగార్రాజు హీరోయిన్ గా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస విజయాలతో పూజా హెగ్డే క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయిన సంగతి తెలిసిందే.


అందువలన కాజల్ కి బదులుగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా పూజా హెగ్డే మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: